
- కోటి హోం కిట్‌లు సిద్ధం
- పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక వార్డ్‌లు ఏర్పాటు
హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే కోవిడ్ కిట్ ను అందజేస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక వార్డ్‌లు ఏర్పాటు చేశామన్న హరీష్.. ఇందుకోసం కోటి హోం కిట్‌లు సిద్ధం చేశామన్నారు. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉన్నాయని.. వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటా జ్వర పరీక్ష నిర్వహించి, ప్రజలందరి ఆరోగ్య వివరాలను ఆరోగ్యశాఖ సేకరిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.