బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వస్తోంది

బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వస్తోంది

ఆదిలాబాద్: బీఆర్ఎస్ తో దేశంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భారత్ రాష్ట్ర సమితికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. బోధ్ మండలం ధన్నూరులో రూ. 6.52 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. అందకే దేశ ప్రజలు ఇవాళ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్రం లెక్క దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదని, బీఆర్ఎస్ తో దేశ భవిష్యత్ ను మారుస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రాజకీయంగా లబ్దిపొందేందుకే కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.