వసతి గృహ విద్యార్థుల కు మెరుగైన విద్య అందించాలి : ఉట్నూర్ ఐడీటీఏ పీవో యువరాజ్ మర్మాట్

వసతి గృహ విద్యార్థుల కు మెరుగైన విద్య అందించాలి : ఉట్నూర్ ఐడీటీఏ పీవో యువరాజ్ మర్మాట్

నస్పూర్, వెలుగు: ఆశ్రమ స్కూళ్ల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఉట్నూర్ ఐడీటీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. మంగళవారం మంచిర్యాలతోపాటు లక్షెట్టిపేట, జన్నారంలోని గిరిజన ఆశ్రమ స్కూళ్లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి స్కూల్, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, మెనూ ప్రకారం భోజనం పంపిణీ, ఆహారం రుచి, మెనూ అమలు వివరాలు తెలుసుకున్నారు. 

తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థు లకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని.. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా వసతి గృహ పరిసరాల్లో నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు.