దళిత బంధు సామాజిక విప్లవంగా భావించాలి

దళిత బంధు సామాజిక విప్లవంగా భావించాలి

హాలియా, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమకాల్వ ఆయకట్టుకు గురువారం ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగర్‌‌‌‌‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ వద్ద పూజలు నిర్వహించిన తర్వాత నీటిని వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జులైలోనే కాల్వకు నీటిని విడుదల చేయడం ఇదే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైం అన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కృషితోనే రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందన్నారు. ఎడమకాల్వ ఆయకట్టుకు ఆన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో సాగునీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. రైతలు నీటిని పొదుపుగా వాడుకొని, వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. కృష్ణా నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని రాజవరం మేజర్‌‌‌‌‌‌‌‌ చివరి భూములకు సైతం నీరు అందిస్తామన్నారు. అంతకుముందు నందికొండ మున్సిపాలిటీలో వైకుంఠధామం, శానిటేషన్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌శర్మ, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్పీ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ధర్మానాయక్, జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఇరిగి పెద్దులు, నాయకులు ఇస్లావత్‌‌‌‌‌‌‌‌ రాంచందర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, అబ్బిడి కృష్ణారెడ్డి, సూర్యా భాష్యా, చెన్ను అనురాధ సుందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆంగోతు భగవాన్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన 96 మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను గురువారం హాలియాలో మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని సామాజిక విప్లవంగా భావించాలని సూచించారు. దళితుల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 2 వేల మందిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు.