డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 31, 2017 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ రోజు ఆయన సూర్యపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని మండల రెవిన్యూ కార్యాలయంలో తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో సహా ఓటును నమోదు చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించాయి. ఆయన అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పార్టీ శ్రేణులను మానిటరింగ్ చేస్తూ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్ తర్వాత డిగ్రీతో సమానమైన మూడు సంవత్సరాల విద్యను అభ్యసించిన వారందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

For More News..

నేటి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోవాల్సిందే..

16 మందిని కిడ్నాప్ చేసి చంపిన మావోయిస్టులు

పీజీలు చదివి బిచ్చమెత్తుతున్నారు

రాష్ట్రంలో కొత్తగా 2,214 కరోనా కేసులు