V6 News

జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలు దోపిడి

జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలు దోపిడి

రాయలసీమ ప్రాజెక్టును ఏపీ ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తమ సూచనలను ఏపీ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై ఏపీకి.. తమ అభ్యంతరాలు తెలిపామన్నారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణను ఏడారి చేసేలా ఆంధ్ర ప్రాజెక్టులున్నాయన్నారు. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను ఏపీ దోపిడి చేసిందన్నారు. ఏపీకి వంతపాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనన్నారు. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి ఏపీ ముందుకెళ్లిందన్నారు.