మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్కు చెక్

మిషన్ భగీరథతో  ఫ్లోరోసిస్కు చెక్

గత పాలకుల నిర్లక్ష్యం వలనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ప్రజలకు శాపంగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 40 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించినా... ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదని మండిపడ్డారు.  ఫ్లోరైడ్ సమస్యపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమనాయకుడిగా సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని చెప్పారు. 

మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్కు చెక్..
ప్రపంచ జనాభాలో 15% దివ్యాంగులు ఉన్న నియోజకవర్గం.. మునుగోడు నియోజకవర్గం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఫ్లోరోసిస్ రక్కసి మరింత విస్తరిస్తే..మునుగోడు "నో మ్యాన్ జోన్" గా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఐక్యరాజ్యసమితి హెచ్చరించిందన్నారు.  స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమేశారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ ఏడాదిలో మునుగోడులో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పడం సీఎం కేసీఆర్ సాధించిన విజయానికి నిదర్శనమన్నారు. 
 
పింఛన్ల పంపిణీలో అగ్రస్థానం..
దేశంలో ఎక్కడా లేనివిధంగా 46 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్లో ఆసరా పెన్షన్ను పంపిణీ చేసిన ఆయన..ఒక్క మునుగోడులోనే 40 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు.