కొల్లాపూర్, వెలుగు : రాష్ట్రంలో 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి జూపార్ల కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. కొల్లాపూర్ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. 19 వార్డులకు 18వార్డులు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
