అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తాం: మంత్రి జూపల్లి

 అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తాం: మంత్రి జూపల్లి

అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు . తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. గంజాయి ,డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని  ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి ఇవాళ( సెప్టెంబర్ 13న) రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా.. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు,వినియోగంపై  ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను  ఆదేశించారు మంత్రి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుకున్నప్పుడు ధ్వంసం చేయొద్దని సూచించారు.  నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించే అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు,రవాణాపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు మంత్రి జూపల్లి. 

 నిబంధనలకు విరుద్ధంగా నిడచే పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని సూచించారు జూపల్లి. తాటి ,ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.ఫాంహౌస్ లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు జూపల్లి. ఒకే లైసెన్స్ పై ఎక్కువ బార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.