కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు
  • మంత్రులు వివేక్​ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు పిలుపు
  • మున్సిపల్​ఎన్నికల పోటీ చేసే ఆశావహులకు దిశానిర్దేశం
  • చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో రూ.51.41కోట్ల పనులకు శంకుస్థాపనలు 
  • రూ.12.40 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ 

కోల్​బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఆదిలాబాద్​ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సోమవారం చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలో రూ.51.41కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాలకు రూ.12.40 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. అంతకుముందు చెన్నూరు క్యాంపు ఆఫీస్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భీమా గార్డెన్స్​లో మున్సిపల్​ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ ఆశావహులతో మంత్రులు సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

అభివృద్ది పనులకు శంకుస్థాపన

చెన్నూరు పట్టణంలో రూ.47.11 కోట్లతో ఏటీసీ కేంద్రం, 16వ వార్డులో రూ.50 లక్షలతో ముదిరాజ్ భవనం, 8వ వార్డులో రూ.1.40కోట్లు, 9వ వార్డులో రూ.18.50 లక్షలు, 5వ వార్డులో రూ.20 లక్షల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, ఆస్పిరేషన్ టాయిలెట్స్, మందమర్రి మున్సిపాలిటీలోని హైవే నుంచి నార్లపూర్​లోని స్కూల్​ వరకు రూ.1 కోటితో సీసీ రోడ్డు,23వ వార్డులో రూ.10లక్షలతో సీసీ రోడ్డు,21వార్డులో రూ.12లక్షలతో సీసీ రోడ్డు, 15వార్డులో రూ.1కోటితో డ్రైనేజీ పనులకు కలెక్టర్​ కుమార్ ​దీపక్​తో కలిసి మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో నిర్మించిన మందమర్రి మున్సిపల్​ ఆఫీస్​లో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్, మున్సిపల్​ కమాన్, కామన్​సర్వీస్​ సెంటర్​ను ప్రారంభించారు.

జనవరి 30, 31 ఫిబ్రవరి 1వ తేదీల్లో నిర్వహించే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ప్రచారం పోస్టర్లను ఆలయ కమిటీ, ఆదివాసీ నాయకపోడ్ సంఘం లీడర్లతో కలిసి మంత్రి వివేక్​ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, అడిషనల్​ కలెక్టర్ చంద్రయ్య, డీఆర్​డీఏ కిషన్, డీసీపీ భాస్కర్, జైపూర్​ ఏసీపీ వెంకటేశ్వర్లు,క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపల్​ కమిషనర్లు గద్దె రాజు, రాజలింగు, మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు. 

కాంగ్రెస్​లో చేరిన సర్పంచ్​లు

మంత్రులు వివేక్, జూపల్లి సమక్షంలో కోటపల్లి మండలానికి చెందిన బీఆర్​ఎస్, ఇండిపెండెంట్​సర్పంచ్​లు కాంగ్రెస్​లో చేరారు. మండలంలోని వెంచపల్లి, సూపాక, లింగన్నపేట సర్పంచ్​లు పడాల రవళి, సర్పంచి కాశెట్టి సతీశ్, కొండగుర్ల లావణ్య, బీఆర్​ఎస్​కు చెందిన సర్వాయిపేట సర్పంచ్ గుగులోత్​ రాజేశ్ ​నాయక్​తో పాటు పలువురు లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరగా వారికి మంత్రులు కండువాలు కప్పి ఆహ్వానించారు.