కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : మంత్రి జూపల్లి

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం :  మంత్రి జూపల్లి

నాగర్​ కర్నూల్/ వనపర్తి, వెలుగు :  కాంగ్రెస్​ తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సోమవారం కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 

వనపర్తిలో ఎమ్మెల్యే మెఘారెడ్డితో, నాగర్​ కర్నూల్​ లో ఎమ్మెల్యే డాక్టర్​ రాజేశ్​రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల రాజేశ్​ రెడ్డితో కలిసి మాట్లాడారు. నాగర్​ కర్నూల్, కొల్లాపూర్​లో బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​రెడ్డి, బీరం హర్షవర్దన్​ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కల్వకుర్తిలో మాజీ మున్సిపల్​ చైర్మన్​ ఎడ్మ సత్యం నేతృత్వంలో భారీ బైక్​ర్యాలీ చేపట్టారు.