
అమరావతి, వెలుగు: మాజీ సీఎం, టీడీపీ చీఫ్చంద్రబాబు ఓ సన్నాసి, పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అనిఏపీ సివిల్ సప్లయ్స్ మంత్రి కొడాలి నాని కామెంట్
చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల పొలి టికల్ ఇండస్ట్రీలో మోసపోయిన వ్యక్తుల లిస్టులో ప్రతి ఒక్కరి పేరు ఉంటుందన్నారు. 23 సీట్లతో టీడీపీని ప్రజలు పాతాళానికి తొక్కినా.. చంద్రబాబు, లోకేశ్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజకీయాల్లో టీడీపీ పని అయిపోయిందని, షెడ్డుకు తీసుకెళ్లినా రిపేరీ కుదరదన్నారు. శనివారం అమరావతిలోని సచివాలయంలో కొడాలి నాని మాట్లాడారు. సీఎం జగన్ చిటికేస్తే..టీడీపీని వైసీపీ సెంట్రల్ ఆఫీసు స్టోర్ రూంలో పడేస్తామన్నారు.
సొంత మామ ఎన్టీఆర్ నుంచి సీఎం సీటును, పార్టీని లాక్కొ ని సొం తంగా పార్టీ పెట్టినట్లు బిల్డప్ లో బతికేస్తున్నాడని విమర్శించారు. సీఎం జగన్ కుటుం బం గురించి పిచ్చిగా మాట్లాడితే, చంద్రబాబు కుటుంబ బండారాన్ని బయటపెడతానని హెచ్చరిం చారు. జగన్ ఒక్క మాట చెబితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. వైసీపీ డోర్లు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు వరద బాధితుల్లా వచ్చి చేరతారని పేర్కొన్నారు. చివరకు ఆ పార్టీలో చంద్రబాబు, ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన భజన బృందం,లోకేశ్ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు దొంగ పోరాటాలు, దొంగ దీక్షలు 40 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నామని, మాజీ మంత్రులు దేవినేని ఉమ, యనుమల రామకృష్ణుడు బ్రోకర్ రాజకీయాలు మానుకోవాలని సూచిం చారు.