టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రండి..మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డికి ఆహ్వానం

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రండి..మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డికి ఆహ్వానం

పద్మారావునగర్, వెలుగు: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనున్న తెలంగాణ డెవలప్‌‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని టీడీఎఫ్ ప్రతినిధులు బుధవారం ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీడీఎఫ్‌‌ను వారు అభినందించారు. 

ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీఎఫ్ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు ప్రీతి చల్లా, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, ఇండియా చైర్మన్ గోన రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరేందర్, అనుపమ, వినీల్ పాల్గొన్నారు.