కరెంట్లో జగదీష్ రెడ్డి రూ. 10 వేల కోట్లు తిన్నాడు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 కరెంట్లో జగదీష్ రెడ్డి రూ. 10 వేల కోట్లు తిన్నాడు :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అసెంబ్లీలో జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు 24 గంటల కరెంట్ ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్దమని మంత్రి  ఆరోపించారు.  24 గంటలు కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ జగదీశ్ రెడ్డి సభను తప్పదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 9 ఏళ్లలో యాదాద్రి పవర్ స్టేషన్ ముందుపడలేదని చెప్పారు. యాదాద్రి పవర్ స్టేషన్ దేశంలో అతిపెద్ద కుంభకోణమని చెప్పారు. 

విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందన్న మంత్రి..  ఇందులో జగదీష్ రెడ్డి రూ. 10 వేల కోట్లు తిన్నాడని ఆరోపించారు.  ఇందులో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉందన్నారు.. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారన్నారు.  రిటైర్ట్ అధికారులతో విద్యుత్ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.  

లాగ్ బుక్ లను గత ప్రభుత్వం మాయం చేసిందని ఆరోపించారు.  విద్యుత్  సమీక్షకు ప్రభాకర్ పిలిచిన  రాలేదని అన్నారు.  గత ప్రభుత్వ పెద్దలు దోచుకుని తిన్నారని ఆరోపించారు. దీనిపై ఎంక్వైరీ వేయస్తామని స్పష్టం చేశారు.