రూ.60 వేల కోట్లతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ రోడ్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

రూ.60 వేల కోట్లతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ రోడ్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో రూ. 60వేల కోట్లతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం వరకు చేపట్టిన నాలుగు లేన్ల రోడ్డు పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 

అన్ని గ్రామాలకు రోడ్లతో పాటు, మురుగు కాల్వలను నిర్మిస్తున్నామని, ఏఎంఆర్పీ కాల్వల లైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.450 కోట్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే మూడేండ్లలో ఇల్లులేని వారే ఉండకుండా.. ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు. ప్రతి గ్రామంలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

 పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే మూడేళ్లలో గ్రామాల స్వరూపాలను మారుస్తామని చెప్పారు. కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో మహిళలకు రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టించి ఇస్తామన్నారు. ప్రతీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముసాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుర్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య పాల్గొన్నారు.