పదేండ్లు కాంగ్రెస్ సర్కార్ కు ఢోకా లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పదేండ్లు కాంగ్రెస్ సర్కార్ కు ఢోకా లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ప్రతిపక్షాల విమర్శలకు ప్రజల తీర్పు చెంపపెట్టు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, వెలుగు:  పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.  తొలి విడత ఎన్నికల్లో  కనగల్ మండలం దోరపల్లి సర్పంచ్ గా గెలుపొందిన బక్క ఎల్లమ్మ సోమవారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపల్లి వీరసేనారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  

సర్పంచ్ ఎల్లమ్మను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. ప్రజల్లో స్పందన చూస్తుంటే వచ్చే పదేండ్లు కాంగ్రెస్ సర్కార్ కు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పసలేని ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. 

ప్రతిపక్షాల విమర్శలకు ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తున్నదని,తెలంగాణ రైజింగ్ నినాదంతో దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో కాంగ్రెస్ నేతలు  వేమిరెడ్డి రవీందర్ రెడ్డి, కడారి శంకర్, మన్నెం శ్రీనివాస్, బైరగోని దుర్గయ్య , మన్నెం మల్లేశ్, మాదగోని సైదులు, బక్క రాజశేఖర్ తదితరులు ఉన్నారు.