ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: వరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బొడ్రాయికి మంత్రి రూ.లక్ష విరాళంగా అందజేశారు. మంత్రి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు బలాన్నిస్తాయని తెలిపారు.
సంప్రదాయాల పరిరక్షణతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలన్నారు. మాజీ కార్పొరేటర్ పల్లం పద్మ రవి, కత్తెరశాల వేణు, నాగపూరి కల్పన పాల్గొన్నారు.
