ఐనవోలు జాతరలో ఈ ఏడాది భారీ ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ

ఐనవోలు జాతరలో ఈ ఏడాది భారీ ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ

హనుమకొండ: ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరను ప్రతి యేటా సంక్రాంతితో ప్రారంభించి ఉగాది వరకు మూడు నెలల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు లక్షల్లో తరలి వస్తారు. 2024 లో జరిగే ఐనవోలు మల్లికార్జున జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులను జాతర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. 

ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మేడారం , ఐనవోలు, కొమురవెల్లి మల్లన్న జాతర  నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేడారం మహా జాతర సవ్యంగా జరిగేలా మంత్రి సీతక్కతో కలిసి పనిచేస్తామన్నారు. 

గతంలో కంటే ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తాం 

గతంలో కంటే 2024లో జరిగే జాతర ఏర్పాట్లకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నిర్ణయం వెల్లడిస్తాం. ఐనవోలు జాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సుురేఖ. 

భక్తుల క్యూలైన్ల ఏర్పాటు, జాతర ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలని అధికారులను కోరారు. వృద్ధులు, మహిళలు, గర్భిణీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతర లో భక్తులకు ఏమైనా అత్యవసర  ఇబ్బందులు ఏర్పడితే అత్యవసర సేవలు అందించేందుకు  అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు. 

అంతరాయం లేని కరెంట్ సరఫరా, హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతం కంటే 2024 లో మెరుగైసన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ.