చేనేత కార్మికులను ఆదుకుంటాం : మంత్రి కొండా సురేఖ

చేనేత కార్మికులను ఆదుకుంటాం : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: చేనేత రంగాన్ని, కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని 3 లక్షల బెడ్‌‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, పద్మశాలీ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ మంత్రిని కలిసి చేనేత కార్మికుల సమస్యలు, ఉపాధి మార్గాలపై చర్చించారు. 

జీవో 15 విధానానికి వ్యతిరేకంగా ‘టెస్కో’ ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ఈ నెల 1 నుంచి ఆందోళన చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. చేనేత ఉత్పత్తులను మునుపటిలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసేలా భరోసా ఇస్తామని మంత్రి సురేఖ హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ధర్నాను విరమించారు.