మా ఊరికి ఏం చేశారు?.. మంత్రిని నిలదీసిన గ్రామస్తులు

మా ఊరికి ఏం చేశారు?.. మంత్రిని నిలదీసిన గ్రామస్తులు

జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చేదు అనుభవం

జగిత్యాల /బుగ్గారం, వెలుగు: మంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. గురువారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ లో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రిని గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో డెవలప్​మెంట్ జరగలేదంటూ గ్రామస్తులంతా ఒక్కటై నిరసనగా.. మంత్రి రాగానే కరెంట్ కట్ చేశారు.  గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటని మంత్రిని ప్రశ్నించారు. ఎలాంటి పనులు చేయని మంత్రి తమ ఊర్లోకి రావడం ఎందుకని మండిపడ్డారు. ఊర్లో కనీసం రోడ్లు, నీళ్లు,  బస్సు సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అభివృద్ధి కోసం వస్తున్నావా.. లీడర్ల కోసం వస్తున్నావా’ అని ప్రశ్నించారు. మీరు కోరినవన్నీ నెరవేరుస్తానని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన మంత్రి కొప్పుల.. చీకట్లోనే గ్రామపంచాయతీ బిల్డింగ్, సీసీ రోడ్లను ప్రారంభించి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ