ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంపై మాట్లాడొద్దంటూ కేటీఆర్ ట్వీట్

ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంపై మాట్లాడొద్దంటూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ పార్టీ నాయకులకు విజ్జప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారని, వీటిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తన ట్వీట్ ద్వారా నేతలు, కార్యకర్తలకు సూచించారు.  

ఇక.. మునుగోడు బై పోల్​ వేళ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామాకు తెరలేచింది. హైదరాబాద్​ శివారులోని ఫామ్​హౌజ్​లో తమను కొనేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు నలుగురు టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు  పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి , రేగా కాంతారావు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడికెళ్లి దాడులు చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడ్డట్లు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు. ఇందులో ఇద్దరు స్వామీజీలు ఉన్నారు. ఆ ముగ్గురిని బీజేపీనే రంగంలోకి దింపి, తమ ఎమ్మెల్యేలను వంద కోట్లతో కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్​ఎస్​ ఆరోపిస్తుండగా... ఇదంతా ప్రగతిభవన్​ డైరెక్షన్​లో టీఆర్​ఎస్​ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడింది. ఈ క్రమంలోనే  ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు ఇవాళ హైకోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలెవరూ మీడియా ముందు మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు కోరారు.