ఒక్క అవకాశం అంటున్న కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు : కేటీఆర్‌

ఒక్క అవకాశం అంటున్న కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు : కేటీఆర్‌

కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ ఒక్కరిని ఒన్ చేస్కోదని (సొంత మనిషిలా) మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రతి మనిషి ఇది నా పార్టీ, మన పార్టీ, ఇంటి పార్టీ అని BRSను సొంత పార్టీలా భావిస్తారని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరెంట్ పంచాయతీ, నీళ్ల పంచాయతీ పోయిందన్నారు. అనాడు కాకతీయ కాల్వలపై మోటార్లు పెడితే.. మోటర్ల వైర్లు కట్ చేసి.. పోలీస్ స్టేషన్ల అప్పగించేవారని చెప్పారు. తెలంగాణ రాకముందు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల తర్వాత స్నానాలు చేయడం కోసం ఒక పది నిమిషాలు కరెంట్ వేయండని కరెంటోళ్లని వేడుకునేటోళ్లమని చెప్పారు. 

ఒక అవకాశం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో అడిగితే ఒక్క అవకాశం ఇచ్చారని, అయితే.. ఇప్పుడు అక్కడ కరెంటు లేక కర్ణాటక రైతులు ఆగమైతున్నారని చెప్పారు. 11 సార్లు అవకాశం ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏముందని ప్రశ్నించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు అడుక్కుంటున్నారని, కర్ణాటక జనం మోసపోయినట్టు తెలంగాణ ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ముందు కర్నాటక రాష్ట్రంలో  కరెంట్ సప్లై ఇవ్వు.. ఆ తర్వాత తెలంగాణను ఉద్దరించు అని ఖర్గేను ఉద్దేశిస్తూ కేటీఆర్ మాట్లాడారు.  కేసీఆర్ భరోసా కింద 15 అంశాలు ఉన్నాయని, వాటిని ప్రతి కార్యకర్త ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేసీఆర్ పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. 

పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ నేతలు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి బుధవారం (అక్టోబర్ 25న) తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. వీరికి కేటీఆర్‌.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్​ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.