రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారు : కేటీఆర్

 రాజకీయ నిరుద్యోగులే  మార్పు కోరుకుంటున్నారు : కేటీఆర్

తెలంగాణలో మార్పు కావాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.  రాష్టంలో కొత్తగా రావాల్సిన మార్పు ఏమీ లేదని,   2014లోనే ప్రత్యేక రాష్ట్రం రూపంలో మార్పువచ్చిందని తెలిపారు.  ఇప్పుడు కూడా రాజకీయ నిరుద్యోగులే తప్ప  ప్రజలు దాని గురించి ఆలోచించడం లేదన్నారు.  

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు 80సీట్లు వస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీ,  కాంగ్రెస్ నెంబర్ 02 స్థానం కోసం పోటీ పడుతున్నాయని విమర్శించారు.  హైదరాబాద్ పరిధిలో టూరిస్టు ప్రాంతాలు  తక్కువగా ఉన్నాయని .. ఈ సారి తనకు టూరిజం శాఖ  ఇవ్వాలని సీఎంను కోరుతానని కేటీఆర్ చెప్పారు.  

ALSO READ : తెలంగాణలో పది రోజుల్లో ప్రజా రాజ్యం రానుంది : పొంగులేటి శ్రీనివాసరెడ్డి