మాస్టర్ ప్లాన్ వల్ల ఒకరు చనిపోయారంట కదా : కేటీఆర్

మాస్టర్ ప్లాన్ వల్ల ఒకరు చనిపోయారంట కదా : కేటీఆర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల ఆందోళనపై మంత్రి కేసీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం గురించి తనకు తెలియదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజీలో ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం ప్రకారం మార్పులు చేర్పులు చేస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు.

మాస్టర్ ప్లాన్ వల్ల ఓ రైతు చనిపోయాడంట కదా అని కమిషనర్ను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశ్యం తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల అభ్యంతరాలను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 

మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన రైతులు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు దాటిలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.