రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి రాజకీయాలు చేస్తున్రు : కేటీఆర్

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి రాజకీయాలు చేస్తున్రు : కేటీఆర్

రాజన్న సిరిసిల్ల : గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు. రాజ్ భవన్ ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని గవర్నర్ కు సూచించారు. గవర్నర్ అధికారిక నివాసంలో ప్రధాని ఫోటోలు పెట్టుకోవడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. 

బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను ఇంకా కొనసాగించడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకోకపోయినా గవర్నర్ పదవిలో ఉన్నోళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్న వారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా మోడీనే చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. బ్రిటీష్ కాలంలో పెట్టిన రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చినప్పుడు అప్పటి గవర్నర్ పదవిని ఎందుకు మార్చడంలేదని ప్రశ్నించారు.