గబ్బు చేసేది వీళ్లే.. మళ్లీ లొల్లిపెట్టేది వీళ్లే: కేటీఆర్

గబ్బు చేసేది వీళ్లే.. మళ్లీ లొల్లిపెట్టేది వీళ్లే: కేటీఆర్

 

  • రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేని దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఇక్కడ్నే ఉన్నయ్
  • పిల్లలకు కొలువులొస్తుంటే వాళ్ల కండ్లు మండుతున్నయ్
  • అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు
  • జాబ్స్ ఇయ్యాలంటే ప్రైవేట్​ కంపెనీలను ఆహ్వానించక తప్పదు
  • కొంగర కలాన్‌లో ఫాక్స్​కాన్ ​ప్లాంట్​ నిర్మాణానికి మంత్రి భూమి పూజ

రంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మం చి పేరు వస్తుందని ఓర్వలేకనే ప్రతిపక్షాలు టీఎస్‌‌‌‌పీఎస్సీ, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ పేపర్లు లీక్ చేశాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వం 2.20 లక్షల ఉద్యో గాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. 1.30 లక్షల ఉద్యోగాలు నింపేసినం. ఇంకో 83 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రి య నడుస్తున్నది. ఆ ఉద్యోగాలు నింపితే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మంచి పేరు వస్తదని ఈ దౌర్భాగ్యులే (ప్రతిపక్ష నేత లు) పేపర్​లీక్ చేస్తరు. వీళ్లే టీఎస్​పీఎస్సీలోకి చొరబడుతరు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేసి గబ్బుగబ్బు చేసేది వీళ్లే. మల్ల బయటికొచ్చి లొల్లిపెట్టేది వీళ్లే.. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటదా?” అని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌‌‌‌లో ఫాక్స్‌‌‌‌కాన్​యూనిట్‌‌‌‌కు సోమవారం కేటీఆర్ భూమిపూజ చేశారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక ఏడ్చే దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని విమర్శించారు. ‘‘రాష్ట్రం, ప్రజలు బాగుపడితే సంబురపడుతరు.. పాలమూరు పచ్చబడుతుంటే, రంగారెడ్డికి నీళ్లు వస్తుంటే సంతోషపడుతరు.. కానీ ఇక్కడున్న ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయి. ఇక్కడున్న పిల్లలకు కొలువులొస్తుంటే, ఉద్యోగాలు నింపుతుంటే కడుపుమండి పేపర్​ లీకేజీలు వాళ్లే చేస్తున్నారు” అని మండిపడ్డారు.

ఫాక్స్ కాన్ ఏర్పాటు చారిత్రాత్మకం 

‘‘రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక సందర్భం. మొదటి దశలోనే రూ.4 వేల కోట్ల పెట్టుబడితో, 200 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ నెలకొల్పుతున్నారు. తద్వారా 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే అన్ని అనుమతులు ఇచ్చాం” అని కేటీఆర్ అన్నారు. అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని, 140 కోట్ల జనాభా కలిగిన ఇండియాలో కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలు సహా అన్ని రంగాలను కలుపుకుని 60 లక్షల ఉద్యోగాలే ఇవ్వగలుగుతోందని చెప్పారు. దేశ జనాభాలో ఇది 0.5 శాతం మాత్రమేనని తెలిపారు. కానీ 4కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతానికి పైగా అంటే ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. మిగతా కోటీ యాభై లక్షల మంది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

కష్టపడి తెస్తున్న కంపెనీలను కాపాడుకోవాలె

ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, కష్టపడి తెస్తున్న కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని కేటీఆర్ అన్నారు. రానున్న తొమ్మిది నెలల్లోనే ఫాక్స్ కాన్ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని, ఈ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతకు స్కిల్​డెవలప్​​మెంట్​శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు దక్కేలా చొరవ చూపాలని సూచించారు. ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్​కంపెనీలను ఆహ్వానించడం తప్ప ప్రభుత్వాలకు ఇంకోమార్గం లేదన్నారు. హైటెక్ సిటీని తలదన్నే రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దన్నారు. 

ఎవరి మీద మార్చ్ చేస్తున్రు

‘‘దశాబ్దాల పాటు ఏడిపిచ్చినోళ్లు.. సతాయించినోళ్లు.. కరెంట్ ఇయ్యనోళ్లు. నీళ్లియ్యక కన్నీళ్లు పెట్టిచ్చినోళ్లు మల్లా వచ్చి డైలాగులు కొడితే దానికి పడిపోదామా? ఆలోచించండి. స్టేబుల్​గవర్నమెంట్, ఏబుల్​లీడర్​షిప్‌‌‌‌తోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. కేసీఆర్​రూపంలో ఈ రెండు ఉండబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. మనం గెలుసుడు ముఖ్యం కాదు.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మూడోసారి ముఖ్యమంత్రి అవుడు ముఖ్యం కాదు.. అత్తెసరు మార్కులతో గెలుసుడు కాదు.. వంద సీట్లు కొట్టి, డంకా బజాయించి దేశం ముందు ‘మా ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేసిండు కాబట్టే హ్యాట్రిక్​కొడుతున్నం’ అనే కసి, కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో మనం పనిచేయాల్సి ఉన్నది” అని చెప్పారు. మోడీ చెప్పినట్టు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, తొమ్మిదేండ్లల్ల 18 కోట్ల ఉద్యోగాలు తెచ్చి ఉంటే నిరుద్యోగ మార్చ్​ఎందుకు చేయాల్సి వస్తుండేదని ప్రశ్నించారు. మోడీ మీదనా? లేక కేసీఆర్ మీదనా? ఎవరి మీద మార్చ్​చేస్తున్నారో వాళ్లు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.