మూసీనది పై 14 కొత్త బ్రిడ్జిలు కట్టబోతున్నం: మంత్రి కేటీఆర్

మూసీనది పై 14 కొత్త బ్రిడ్జిలు కట్టబోతున్నం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని ఆయన చెప్పారు. అయ్యప్ప కాలనీలోకి ఇకపై వరద నీరు రాదని అన్నారు. ఎల్బీనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో రూ.220 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని ఆయన తెలిపారు. 

ప్రతి ఏడాది సుమారు 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‭కు వచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది పనులు జరిపిస్తామని తెలిపారు. రూ.985 కోట్లతో నాలాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక మూసీనది పై 14 కొత్త బ్రిడ్జిలను త్వరలో కట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. రూ.84 లక్షలతో జంతువుల కోసం స్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆటోనగర్‭లో ఫ్లవర్ గార్డెన్‭ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కేటీఆర్ వల్లే హైదరాబాద్‭కు గుర్తింపు: మల్లారెడ్డి

తెలంగాణ అభివృద్ధిని చూసి.. పక్కనున్న అన్ని రాష్ట్రాలు జలసిగా ఫీల్ అవుతున్నాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అభివృద్ధి లేదని చెప్పారు. ప్రపంచంలోనే హైదరాబాద్‭కి ఒక గుర్తింపు తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 12,700 గ్రామాల్లో.. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్ ఉండాలని చెప్పిన ఏకైక సీఎం కేసీఆరేనని ఆయన కొనియాడారు. ఎల్బీనగర్ లోని స్మశాన వాటికను చూస్తే.. ఫిలింసిటీకి పోతున్నామా .. స్మశాన వాటికకు పోతున్నామా.. అన్నంత ఆశ్చర్యంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‭ను గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి ప్రజలను కోరారు.