వచ్చే ఎండాకాలం వరకు అందుబాటులోకి ఎస్టీపీలు

వచ్చే ఎండాకాలం వరకు అందుబాటులోకి ఎస్టీపీలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని ఫ‌తేన‌గ‌ర్‌ ఉన్న ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ ప‌రిశీలించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై ఆరా తీశారు. ఎస్టీపీ ప‌నులు చేస్తున్న కార్మికుల‌తో కేటీఆర్ మాట్లాడారు. 1259 ఎంఎల్‌డీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీలు 2023 ఎండ‌కాలం నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని కేటీఆర్ తెలిపారు. 100 శాతం మురుగునీటి శుద్ధి న‌గ‌రంగా హైద‌రాబాద్ మార‌బోతుంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.