చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు

జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులో తుది తీర్పు వెల్లడించినందుకు సీజేఐకి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు చెబుతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం  ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సుప్రీంకోర్టు తీర్పు తోడ్పడుతుందన్నారు. 

పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు..
15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న  జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసుపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారించింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 8 వేల నుంచి 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టులను పరిగణలోకి తీసుకుంటుకున్నట్టు తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తూ తీర్పు వెలువరించారు. వారివారి స్థలాల్లో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని చెప్పారు.  ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని సూచించారు.