గౌతమ బుద్ధుడు మనదేశంలో పుట్టడం గర్వకారణం

గౌతమ బుద్ధుడు మనదేశంలో పుట్టడం గర్వకారణం
  • నాగార్జునసాగర్లో బుద్ధవనాన్ని ప్రారంభించిన కేటీఆర్

గౌతమ  బుద్ధుడు  భారత దేశంలో పుట్టడం గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్.  ప్రతి ఒక్కరు బుద్ధుడి  సందేశాలు  పాటించాలన్నారు. ఇతర దేశాల్లో  బుద్ధుడిని  తమ  ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. ఇతర దేశాల నుంచి  బౌద్థులు  ఇక్కడకి  వచ్చేలా బౌద్ధారామాలు  తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్  చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. గతంలో జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఎలాంటి అభివృద్ధి చేయలేద చేయలేదన్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. నాగార్జున సాగర్ లో బుద్ధ వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చేశారన్నారు. 

 

వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా.. తాగు నీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఇశాళ సుంకిశాల ఇన్ టెక్ వెల్ పనులకు శంకుస్థాపన చేశారు. 1450 కోట్ల రూపాయలతో.. అదనంగా పదహారున్నర టీఎంసీల నీటిని  పంపింగ్ చేసేలా ఇన్ టెక్ వెల్ నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎండాకాలం వరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 

 

కరెంటు కోతల నుంచి విముక్తి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  కరెంట్ కోతల నుంచి  విముక్తి పొందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో  ఎక్కడ లేని  విధంగా  24 గంటల కరెంట్  ఇస్తున్నామన్నారు. తెలంగాణ కట్టే  పన్నుల డబ్బులతోనే  దేశంలోని  వెనకబడ్డ రాష్ట్రాలను  అభివృద్ది  చేస్తున్నారని  చెప్పారు. రాహుల్ గాంధీకి రైతుల  కష్టాలు తెలియవని.. తెలిసిందల్లా  కబ్లులు, పబ్బులేనని  విమర్శించారు. నల్లగొండ జిల్లా హాలియ  బహిరంగ సభలో  పాల్గొన్నారు కేటీఆర్.