
కంటెంట్ ఉన్న సినిమా హిట్ అయినప్పుడు కంటెంట్ ఉన్న రాజకీయ నాయకుడు హిట్ అవుతాడని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత అంతర్జాతీయ సినిమాకు హైదరాబాద్ వేదికగా మారాలని ఆయన చెప్పారు. ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన కార్యక్రమంలో కథా రచన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని దర్శకుడు దశరథ్ రాశారు. కంటెంట్ ఉన్న సినిమా పాన్ ఇండియా అయినప్పుడు.. కంటెంట్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియాకు వెళ్లలేడాని కేటీఆర్ చెప్పారు. దశరత్ రాసిన కథా రచన పుస్తకాన్ని భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించడం అభినందనీయమన్నారు.
సృజనాత్మక కంటెంట్ అంటే తనకు చాలా ఇష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. పుస్తకాంటే తనకు చాలా ఇష్టమని అమెరికాలో ఉప్పుప్పుడు కూడా పుస్తకాలు చదివేవాడినని చెప్పారు. రోజుకు 12 దినపత్రికలు చదివేవాణ్ని అని తెలిపారు. సినీ పరిశ్రమలో అజ్ఞాత సూరీలు ఎంతో మంది ఉంటారని.. ప్రతి ఒక్కరూ ఒక కథ చెబుతుంటారన్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారని చెప్పారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం కేసీఆర్ లక్షణమన్నారు. వక్తలు మాట్లాడటం వెనుక ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.