అమల్లోకి TS బీపాస్.. త్వరలో కఠినంగా కొత్త GHMC చట్టం

అమల్లోకి TS బీపాస్.. త్వరలో కఠినంగా కొత్త GHMC చట్టం

టీఎస్ బీపాస్ ద్వారా  భవన నిర్మాణాలకు, లే అవుట్ల అనుమతికి  21 రోజుల్లో అనుమతి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. గడువు దాటితే అనుమతిచ్చినట్టేనన్నారు.75 గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు.  MCRHRDలో TS బీపాస్ వెబ్ సైట్ ను ప్రారంభించారు.  లబ్ధిదారులు మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందజేశారు కేటీఆర్ . ఇకపై ఆన్ లైన్లో పారదర్శకంగా  ఇంటి నిర్మాణాలకు అనుమతి లభిస్తుందన్నారు. జలకు మేలు చేసే చట్టాలు చేస్తేనే రాష్ట్రాలకు ప్రయోజనమన్నారు. దేశంలోనే తొలిసారి టీఎస్ బీపాస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.  ధరణి పోర్టల్ ఓ సాహోసపేతమైన నిర్ణయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు మార్పులు దేశానికి మార్గదర్శకమన్నారు. టీఎస్ బీపాస్ విధానం గొప్ప మార్పును తీసుకొస్తుందన్నారు. టీఎస్ బీపాస్ విధానాన్ని ఎవరూ దుర్వినియోగం చేయొద్దన్నారు.

వచ్చే ఏడాది కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తామన్నారు కేటీఆర్.  నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలు కూల్చే చట్టాన్ని తెస్తామన్నారు. దశాబ్దాల నుంచి జరిగిన తప్పిదాల కారణంగా వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. చెరువుల్లో, FTL స్థలాల్లో ఉన్న భవనాలు కూల్చేందుకు కొత్త GHMC చట్టం తెస్తామన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కు ఉన్న ఉజ్వల భవిష్యత్… దేశంలో ఏ నగరానికి లేదన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పెంచవద్దన్నారు.