21 కి.మీ పరిధిలో సైక్లింగ్ ట్రాక్

21 కి.మీ పరిధిలో సైక్లింగ్ ట్రాక్

హైదరాబాద్ లో సోలార్ రూఫ్ తో కూడిన సైక్లింగ్ ట్రాక్ ను అభివృద్ది చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు రేపు  ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్ )  పరిధిలో  శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు.  తొలి విడతగా 21 కి.మీ పరిధిలో  సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది వేసవికాలంలోగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి  సైక్లింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా, ఓఆర్ఆర్ వెంట‌ నానక్‌రామ్‌గూడ- టీఎస్‌పీఏ, నార్సింగి- కొల్లూరు స్ట్రెచ్‌లో 4.5 మీట‌ర్ల వెడ‌ల్పులో 3 లేన్ బై-సైకిల్ ట్రాక్‌కు సెప్టెంబర్ 6న మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేస్తార‌ని ఎంఏ అండ్ యూడీ స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీ అర్వింద్‌కుమార్ తెలిపారు. ఇది సీసీటీవీల‌తోస‌హా అన్ని భద్రతా ఫీచర్లతో 24/7 పని చేస్తుంద‌ని ఆయ‌న వెల్లడించారు.