రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు

 రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు

TSPSC  పేపర్ లీకేజీ వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే తన పేరును లాగుతూ  ప్రభుత్వాన్ని అపత్రిష్ఠపాలు చేస్తున్నందుకు వీరిద్దరికి నోటీసులు పంపుతున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో తనని లాగడం వారి అజ్ఞానానికి  నిదర్శనమని మండిపడ్డారు. ఒక దురదృష్ట సంఘటనను బూచిగా చూపి  మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని కేటీఆర్ ఆరోపించారు. మతిలేని రాజకీయ ఉచ్చులో పడి  యవత చిక్కుకొవద్దని కేటీఆర్  తెలిపారు. ఉద్యోగాల ప్రిపరేషన్ ను కొనసాగించాలని యవతకు మంత్రి పిలుపునిచ్చారు.