
న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. భారత ఎలాక్ట్రానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అవకాశాలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. పారిశ్రామికవేత్తలతో అనుకూలమైన ఎకోసిస్టమ్ ను సృష్టించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రికి కేటీఆర్ వివరించారు. మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కేంద్రమంత్రిని కలిశారు.