
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న సెక్రటేరియెట్ ప్రారంభం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు జనాలను భారీగా తరలించాలని జీహెచ్ఎంసీతో పాటు సమీప నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కేటీఆర్ ఆదేశించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సెక్రటేరియెట్ ప్రారంభోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సం దర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మం దిని తరలించాలన్నారు. జన సమీకరణపై ఈ నెల 13న గ్రేటర్లోని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించాలన్నారు.