మేడిపండు లాంటి బడ్జెట్ నిరాశ కలిగించింది : కేటీఆర్

మేడిపండు లాంటి బడ్జెట్ నిరాశ కలిగించింది : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  బడ్జెట్ నిరాశ కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  మేడిపండు లాంటి బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు  రూ.  1.25 కోట్లు అవసరం అవుతాయి కానీ  బడ్జెట్ లో రూ. 53 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు అనడం విడ్డూరమన్నారు. ప్రతి కరెంట్ మీటర్ కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 KRMB కింద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పింది కాంగ్రెస్ సర్కార్ అని ఆరోపించారు కేటీఆర్.  ఈ నెల 13 న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి KRMB ని  ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ నల్గొండలో కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.  కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రాజెక్టులను, హక్కులను కాపాడితే...  ముఖ్యమంత్రి అయ్యాక  రేవంత్ కేంద్రానికి అప్పగించి తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.