నల్లా నీళ్లు ఇప్పించండని ట్విట్టర్​ ద్వారా కోరిన బాలుడు, స్పందించిన మంత్రి

నల్లా నీళ్లు ఇప్పించండని ట్విట్టర్​ ద్వారా కోరిన బాలుడు, స్పందించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్​గోల్డెన్​సిటీ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమర్​అనే బాలుడు వినూత్న రీతిలో ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్​ను కోరాడు. సెల్ఫీ వీడియోను అటాచ్​చేసి అందులో స్థానిక పరిస్థితి వివరించాడు. చిల్ర్డన్స్ డే సందర్భంగా అడుగుతున్నానని చేతిలో ప్లకార్డు పట్టుకొని కోరాడు. స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరించాలని వాటర్​బోర్డు ఎండీ దానకిశోర్ కు సూచించారు. 

దాన‌కిశోర్ వెంటనే గోల్డెన్ సిటీ కాల‌నీకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. బాలుడితోపాటు కాలనీవాసుల‌ను క‌లిసి మాట్లాడారు. న‌ల్లా పైప్‌లైన్ వేయ‌డానికి జ‌ల‌మండ‌లి రూ.2.85 కోట్లు మంజూరు చేసిందని, పలు కారణాలతో ప‌నులు ఆల‌స్యమయ్యాయని తెలిపారు. రెండు వారాల్లో ప‌నులు పూర్తిచేస్తామని, అప్పటివ‌ర‌కు ట్యాంక‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రా కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.