శివ్వంపేట, వెలుగు: మండలంలోని చండి గ్రామ శివారులో తూప్రాన్- నర్సాపూర్ రహదారి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 334లో కోట్ల రూపాయల విలువ చేసే 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశాడని దానిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, గ్రామస్తులు తహసీల్దార్ కమలాద్రిని కోరారు. సదరు బీఆర్ఎస్ నాయకుడు 2013లో ఫేక్ సర్టిఫికెట్ ద్వారా రెవెన్యూ రికార్డులోకి వచ్చాడని ఆరోపించారు.
అధికారుల దృష్టికి రాగా రికార్డ్ లో నుంచి అతడి పేరు తొలగించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా పెద్ద నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారన్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారన్నారు.
