వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు :  ప్రణాళిక బద్ధంగా పనిచేసి వనపర్తి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్​ పర్సన్,  వైస్ చైర్​పర్సన్, కౌన్సిలర్ల పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపాలిటీలో  మున్సిపల్ చైర్​ పర్సన్ గా మిడిదొడ్డి మాధవి, వైస్ చైర్​పర్సన్ గా మధుసూదన్ గౌడ్ తో  పాటు కాంగ్రెస్​పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. చైర్​ పర్సన్​ మాధవి ఉద్యోగులకు అందించే అలవెన్స్ ఫైల్ పై, తాగునీటి  సమస్యల పరిష్కారం ఫైల్ పై  మొదటి సంతకం చేశారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చైర్​పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​, కౌన్సిలర్లు వారానికో వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటారని, నెలకోసారి మీటింగ్​ పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అనంతరం వనపర్తి మండలం చందాపూరులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న పుల్లరి నీలమ్మ నాగరాజు గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరై దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలిపారు.