సంక్రాంతికి డబుల్​ ​బెడ్​రూం ఇండ్లు పంచుతం: మంత్రి  కేటీఆర్ వెల్లడి

సంక్రాంతికి డబుల్​ ​బెడ్​రూం ఇండ్లు పంచుతం: మంత్రి  కేటీఆర్ వెల్లడి
  •     ఇండ్లులేనోళ్లకే ఫస్ట్ ​చాన్స్​
  •     జాగుంటే నిర్మాణానికి 3 లక్షలు
  •     సమీక్షలో మంత్రి  కేటీఆర్ వెల్లడి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్​రూం ఇండ్లన్నీ సంక్రాంతి నాటికి పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారం  సిరిసిల్ల  కలెక్టరేట్ లో  డబుల్ బెడ్​రూం ఇండ్లు, మన ఊరు–మన బడి పురోగతిపై మంత్రి రివ్యూ చేశారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మొదట ఇండ్లు లేని నిరుపేదల లిస్ట్  తయారు చేయాలని, అర్హులకే ఇండ్లు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. పేద వారికి డిగ్నిటీ హౌసింగ్ పేరిట 502 స్క్వేర్ ఫీట్ల స్థలంలో రెండు పడక గదులు, రెండు బాత్రూంలు, కిచెన్, హాల్ గల నాణ్యమైన ఇండ్లను నిర్మించి ఇచ్చే స్కీం దేశంలో ఎక్కడా లేదన్నారు. పేదవారికి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి  రూ. 3 లక్షలు ఇచ్చే స్కీమ్​ను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు.  

నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లిస్ట్ తయారు చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొత్తం 6,886 డబుల్ బెడ్​రూం ఇండ్లు మంజూరు కాగా.. 3,447 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని,  1,746 ఇండ్లు పంపిణీకి రెడీగా ఉన్నాయన్నారు.  మన ఊరు– మన బడి కింద చేపట్టిన పనులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  జిల్లాలో 172 స్కూళ్లకు రూ.20.38 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. సిరిసిల్ల జిల్లా  ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు.  జిల్లాకు మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ, పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

దేశంలోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అత్యంత నివాస యోగ్యమైన నగరం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బెస్ట్‌‌‌‌‌‌‌‌ లివబుల్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్ లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అయినా గ్లోబల్‌‌‌‌‌‌‌‌ లివబుల్‌‌‌‌‌‌‌‌ ఇండెక్సుల్లో 140వ స్థానంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఉందని, దీనిని టాప్‌‌‌‌‌‌‌‌ -25 లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని ఒక హోటల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రీ ప్లానెట్‌‌‌‌‌‌‌‌ సదస్సులో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నాటికి దేశంలోనే ప్రతి చుక్క మురికినీటిని శుద్ధిచేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అవతరించబోతుందన్నారు.