
ప్రవళ్లిక మృతిని కూడా రాజకీయం చేశారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ప్రవళ్లిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
మంత్రి కేటీఆర్ ని ప్రవళ్లిక కుటుంబ సభ్యులు కలిసి.. తమ ఆవేదన పంచుకున్నారు. మా కూతురు మృతికి కారణమైన శివరాంని కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రవళ్లిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా శిక్షపడేలా చూస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రవళ్లిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సదర్భంగా ప్రవళ్లిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.