
హైదరాబాద్, వెలుగు: ఎన్‌డీఏ అంటే నో డేటా అవేయిలబుల్ గవర్నమెంట్ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నారని నేషనల్ మీడియాలో వచ్చిన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్, లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌కు సంబంధించిన నోట్‌ను తన ట్వీట్‌కు అటాచ్ చేశారు. ఎంతమంది హెల్త్ కేర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారో, కరోనా కారణంగా ఎన్ని ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయో, ఎంత మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారో లెక్కలు చెప్పడం లేదని, ఎంత మంది వలస కార్మికులు చనిపోయారనే వివరాలు కూడా ఇవ్వట్లేదని పేర్కొన్నారు. రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఎంత మందికి లబ్ధి చేకూర్చారనే వివరాలు కేంద్రం వద్ద లేవన్నారు.