కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలి

కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలి

పకడ్బందీ ప్రణాళికతో కరోనా రెండో దశ వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌తో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్ నిర్వహణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టిన ఇంటింటి సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయి. లాక్‌డౌన్ నియమాలను ప్రజలందరూ పాటించాలి. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో కరోనా రెండో దశ వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలి. ప్రజలందరూ లాక్‌డౌన్ నియమాలను పాటిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి. స్వీయ నియంత్రణనే శ్రీరామరక్ష. జిల్లాలో రోజువారీగా పరిస్థితిని నేను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తా’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.