ఈటల రాజేందర్ గెలిస్తే ఏంవస్తుందో చెప్పాలి?

ఈటల రాజేందర్ గెలిస్తే ఏంవస్తుందో చెప్పాలి?
  • ఎవరు ఆపినా దళితబంధు ఆగదు

టీఆర్ఎస్ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు, భగీరథ లాంటి పథకాల పేరు మార్చి కేంద్రం అమలు చేస్తుందని ఆయన అన్నారు. పార్టీ ప్రతినిధులతో కలిసి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎలక్షన్ కోసమే అంతా చేస్తున్నామనేది కరెక్ట్ కాదని మంత్రి అన్నారు. ప్రజా అభిమానం ఉంటే గెలుస్తామని.. కానీ ఏం చేసినా ఎలక్షన్ కోసం అంటే ఎట్లా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిలక జోస్యం చెప్పుకుంటే మంచిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‎లు వెయ్యి శాతం కుమ్మక్కయ్యాయన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టాందన్నారు. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్‎లో కూడా అదే జరిగిందన్నారు. బండి సంజయ్, అరవింద్‎లు ఉభయ పార్టీల ఎంపీలని కేటీఆర్ అన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో... రేపు ఏమీ చెస్తాడో చెప్పగలరా అని ప్రశ్నించారు. జై శ్రీరాం నినాదం ఏమయ్యిందన్నారు కేటీఆర్. హుజూరాబాద్‎లో ఈటల గెలిస్తే ప్రజలకు ఏమి వస్తుందో చెప్పాలి అన్న మంత్రి... సిలిండర్ ధర తగ్గిస్తారా... పెట్రోల్, డీజిల్ రేటు తగ్గిస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు. 

హుజురాబాద్‎లో వెయ్యి నామినేషన్లు వేయిస్తాం అనేవాళ్లు ఎక్కడి పోయారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హుజురాబాద్‎లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఎవరు ఆపినా దళితబంధు ఆగదన్న కేటీఆర్... ఎలక్షన్ ఇంకో పది రోజులు మాత్రమే ఉందని.. ఆ తర్వాత మళ్లీ దళితబంధు వస్తుందన్నారు. నిన్న కూడా 250 కోట్లు ఇచ్చామన్నారు. భట్టి విక్రమార్క మంచోడే కానీ... కాంగ్రెస్‎లో ఇప్పడు అక్రమార్కులదే పెత్తనం నడుస్తుందన్నారు. నిన్న 20 నియోజక వర్గాల ముఖ్య నేతలతో సమావేశం అయ్యానని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంకో 15 రోజుల్లో 98 శాతం వాక్సినేషన్ పూర్తి అవుతుందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆరే ఉండాలని ఇప్పటికే 10 నామినేషన్లు దాఖలు అయ్యాయని కేటీఆర్ తెలిపారు. నవంబర్ 15న జరగనున్న పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలన్నారు. ఇప్పటికే పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి అయ్యిందని తెలిపారు. నవంబర్ 15న ఆర్టీసీ బస్సులు మా మీటింగ్‎కు వస్తాయన్న కేటీఆర్.. ఇప్పటికే డబ్బులు కట్టి బుక్ చేసుకున్నామని తెలిపారు. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చట్ట సభల్లో ఉన్నవాళ్లకు శిక్షణా తరగతులు ముందుగా నిర్వహించి.. ఆ తర్వాత నియోజక వర్గ స్థాయి, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.

For More News..

కేసీఆర్​ బొమ్మకు ఓట్లు పడే రోజులు పోయినయ్: ఈటల