ఆటో కార్మికులను ఆదుకోవడం కేసీఆర్తోనే సాధ్యం : కేటీఆర్

ఆటో కార్మికులను ఆదుకోవడం కేసీఆర్తోనే సాధ్యం : కేటీఆర్

ఆడపిల్ల పెళ్లికి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 116 రూపాయలు ఇస్తుంటే ఇది మార్పు కాదా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం మార్పు కాదా..? అన్నారు. నేను రానో సర్కారు దవాఖానకు బిడ్డో అనే పరిస్థితి నుంచి నేను సర్కార్ దవాఖానకే పోతా అనే పరిస్థితికి తీసుకురావడం మార్పు కాదా...? అని అడిగారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు బాగున్నాయా..? ఇది మార్పు కాదా..? అని అడిగారు. హైదరాబాద్ లో ఆటో యూనియన్ నాయకులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యి.. వారితో మాట్లాడారు. ఆటోలకు ఫిట్ నెస్ చార్జీలు రద్దు అంశంపైనా మాట్లాడారు. 

నిరుద్యోగం ఎవరికి ఎక్కువ అయ్యింది.. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగం ఎక్కువైంది...వాళ్లకు కావాల్సింది రాజకీయ ఉద్యోగాలు.. నిజంగానే కాంగ్రెస్ వాళ్లకు నిరుద్యోగులపై ప్రేమ ఉందా..? అని అన్నారు కేటీఆర్. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ చూపిస్తారా..? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ వాళ్లు ఉదయపూర్ డిక్లరేషన్ రూల్స్ పాటిస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విలువ ఉంటుందా..? అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. ఆయన మాట జనం నమ్ముతారా అని ప్రశ్నించారు.


తెలంగాణ కోసం పిల్లలను చంపింది ఎవరు.. కాంగ్రెస్ పార్టీ. మళ్లీవాళ్లే అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేస్తారా..? అని అడుగుతున్నారు.. హంతకుడే సంతాపం తెలుపుతాడు... దొరికిన దొంగనే నీతివంతమైన మాటలు మాట్లాడుతాడు.. కలికాలం కాకపోతే ఇది ఏ కాలం.. అని కామెంట్స్ చేశారు. ఆటో కార్మికులను ఆదుకునేది కేసీఆర్ మాత్రమే అని చెప్పారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మూడు వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లవి సర్కార్ ఫీట్లు అని చెప్పారు. తెలంగాణ బాగుండాలంటే హైదరాబాద్ బాగుండాలి.. దాదాపు 50 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని చెప్పారు. ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారితే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడని సొంత పార్టీ నేతలే రేవంత్ పై ఈసీకి ఫిర్యాదు చేశారని చెప్పారు.