
బయో ఏషియా సదస్సులో పాల్గొన్న స్టార్టప్స్ కంపెనీకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్.. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ ను తీసుకురావాలని ఆశిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో లైఫ్ సైన్స్, ఫార్మా రంగ నిపుణులు పాల్గొని అనేక అంశాలపై చర్చించారు.
టెక్నాలజీని ఉపయోగించి మెడికల్ డివైజ్ లు, లైఫ్ సైన్స్ లో కొత్త ఇన్నోవేషన్స్ ను తీసుకురాగల అన్ని రకాల అర్హతలు, వరల్డ్ క్లాస్ ఏమినిటీ, రిసోర్స్ ఇండియాలో ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ రంగాల్లో అభివృద్ధి కోసం తెలంగాణ లో దాదాపు 80 బిలియన్ డాలర్ల నుండి..2030 సంవత్సరానికి 250 బిలియన్ డాలర్లకు మూడు వంతులా వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఇన్నోవేషన్ ఇన్ ఫ్రా, ఇన్‌క్లూజివ్ గ్రోత్..ఈ మూడూ భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రతిభావంతులైన దేశంగా మార్చగలవని అభిప్రాయపడ్డారు.