వడ్డెర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం

వడ్డెర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు: నకిరేకల్ నియోజకవర్గంలోని వడ్డెరుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న 219 జయంతి పురస్కరించుకొని తెలంగాణ వడ్డెర కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నకిరేకల్ పట్టణంలోని ఇందిరా గాంధీ సెంటర్లో ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలను వేసి నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి యూనియన్ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెరు ల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. యూనియన్ అధ్యక్షుడు వరికుప్పల రాములు మాట్లాడుతూ వడ్డెరలకు 50 సంవత్సరాలకే పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు.  పీఎసీఎస్ మాజీ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకటేశ్వర్లు, తెలంగాణ వడ్డెర కార్మిక యూనియన్ అధ్యక్షులు వరికుప్పల రాములు తదితరులు పాల్గొన్నారు.