ఎంత సక్సెస్ ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్

ఎంత సక్సెస్ ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్

హైదరాబాద్ నగరం  ఘట్ కేసర్ లోని అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ నిర్వహించిన ఇంజనీరింగ్ విద్యలో పరివర్తన – సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ICTIEE – 2020సదస్సుని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సోమవారం ప్రారంభించారు. లెర్నింగ్ మెథడాలజీ, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎండ్ రీసెర్చ్, బిగ్ డేటా, ఆర్టిఫిషల్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞాన అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఈ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. 2020 ఏడాదిని తెలంగాణ యొక్క ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. క్వాలిటీ విద్యని అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. రాష్ట్రంలో 220 ఇంజనీరింగ్ కాలేజ్ లున్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ అంటే… పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండటం కాదు. అత్యున్నత ప్రొఫెసర్లు ఉండటం. ఎన్ని కాలేజ్ లున్నాయి.? ప్రతి ఏడాది ఎంతమంది ఇంజనీర్లు వస్తున్నారు అనేదానికంటే… ఎంతమంది సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారన్నది ఇంపార్టెంట్.  వివిధ కాలేజ్ లు స్థాపించి క్వాలిటీ విద్యని అందిస్తున్న అనురాగ్ ఇనిస్టిట్యూషన్స్ యాజమాన్యానికి అభినందనలు. విద్యార్థుల్లో స్కిల్స్ నేర్పించడానికి TASK(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్) ని ఏర్పాటు చేశాము. TASK తో కలిసి పనిచేయడానికి వివిధ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ముందుకు రావాలని కోరుతున్నాను. వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు… TS పాస్ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్ కి రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగు పరుస్తున్నాం. ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ లని నేను బలంగా నమ్ముతాను. వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ లకి ఐటీ & ఇండస్ట్రీలని తీసుకెళ్తామని” కేటీఆర్ అన్నారు.