మినరల్ వాటర్ కంటే భగీరథ నీరే స్వచ్ఛమైనదని చెప్పాలి: KTR

మినరల్ వాటర్ కంటే భగీరథ నీరే స్వచ్ఛమైనదని చెప్పాలి: KTR

రాజన్న సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్  బుధవారం ఆకస్మిక పర్యటన చేశారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో  30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి అధికారులతో… ఎగువ మానేరు నుంచి దిగువ మానేరు వరకు మానేరు తీరం వెంబడి మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని చెరువులు, కాలువల వెంట మొక్కలు నాటాలన్నారు. ప్రతి నెల వారం రోజుల పాటు ప్రజల సహకారంతో పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 99 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తియనందున ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, మినరల్ వాటర్ ప్లాంట్లలో, వాటర్ బాటిళ్లలో ఉండే నీటికంటే భగీరథ నీరే స్వచ్ఛమైనదని ప్రజలకు తెలియజెప్పాలని మంత్రి సూచించారు.

అనంతరం వికలాంగులకు కేటీఆర్ ద్విచక్ర వాహనాల పంపిణీ చేశారు. 30 రోజుల ప్రణాళిక విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా యంత్రంగానికి, సిబ్బందికి, సర్పంచులను ఈ సందర్భంగా అభినందించారు. గ్రామ ప్రణాళిక విజయవంతంగా పూర్తిచేసినందకు రూ.4 లక్షల వ్యక్తిగత నిధులతో 1200 మంది పంచాయితీ సిబ్బందికి బీమా ప్రీమియం చెల్లిస్తానని చెప్పారు. అందుకు సంబందించిన చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

Minister KTR Sudden visit in Rajanna Sircilla district on Wednesday